పెద్దపల్లి జిల్లాలో .. చేప పిల్లల పంపిణీ టెండర్లపై సందిగ్ధత

పెద్దపల్లి జిల్లాలో .. చేప పిల్లల పంపిణీ టెండర్లపై సందిగ్ధత
  • రెండుసార్లు నోటిఫికేషన్​ ఇచ్చినా ముందుకు రాని కాంట్రాక్టర్లు 
  • .ప్రక్రియ రద్దవుతుందన్న అనుమానాలతో మూడోసారి  టెండర్లు వేసిన ఇద్దరు కాంట్రాక్టర్లు
  • కమీషన్ తక్కువగా ఇస్తుండడంతో కాంట్రాక్టర్ల నిరాసక్తత..?

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో చేప పిల్లల పంపిణీపై సందిగ్ధత నెలకొంది. గతంలో రెండుసార్లు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. అయితే టెండర్ల ప్రక్రియ రద్దయ్యే అవకాశం ఉండడంతో మూడోసారి ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లు వేసినట్లు సమాచారం. ఇంకా వాటిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువగా ఉంటుండడంతోనే టెండర్లకు కాంట్రాక్టర్లు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. 

ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎల్ఎండీ, సిరిసిల్లలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రెండు ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. వీటి నిర్వహణ సరిగా లేకపోవడంతో చేప పిల్లల పెంపకం నీరుగారిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మత్స్యశాఖ ఆధ్వర్యంలోని ఈ ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణను కావాలనే పట్టించుకోవడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. 

సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేపపిల్లల పంపిణీ 

ఏటా చేప పిల్లల పంపిణీకి సంబంధించిన ప్రక్రియ  జులైలోనే కంప్లీట్​ కావాలి. దీని కోసం మే నుంచే సర్కార్​ ఏర్పాట్లు చేసేది. టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసేందుకు కాంట్రాక్టర్లు నిరాసక్తత చూపుతుండడంతో ఉచిత చేప పిల్లల పంపిణీ సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గతంలో కొన్నిసార్లు టెండర్లను నిలిపేసి చేప పిల్లలను అరకొరగా, లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పంపిణీ చేశారు. దీనివల్ల చేప పిల్లలు సరిగా ఎదగక దిగుబడి రావడం లేదు. మరోవైపు ఎండాకాలంలో నీటి వనరులు ఎండిపోతుండడంతో ఎదగని చేపలను పట్టుకొని అమ్ముకోవాల్సి వస్తోందని మత్స్యకారులు చెబుతున్నారు. దీనివల్ల చేపల బరువు తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రపోజల్స్​ ఇచ్చిండ్రు..

పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, పార్వతి బ్యారేజీ, ​1013 చెరువులు, వీటిపై 133 మత్య్స పారిశ్రామిక సహకార సంఘాలకు చెందిన 9003 కుటుంబాలు, 38 మహిళా సొసైటీలపై 1279 కుటుంబాలు, 7 మత్య్స పారిశ్రామిక మార్కెటింగ్​ సంఘాల ద్వారా 360 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వీరికి చేపలు పెంచుకొని జీవించే వారికి ప్రభుత్వం లైసెన్సులు జారీ చేస్తుంది. జిల్లాలోని నీటి వనరులకు చేప పిల్లలను పెంచేందుకు 1.59 కోట్ల చేప పిల్లలు,  29 లక్షల రొయ్య పిల్లలు అవసరమని మత్స్య శాఖ అధికారులు సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రపోజల్స్​పంపించారు. 

ALSO READ : అమిత్ చైర్మన్​ పదవికి సీనియర్ల బ్రేకులు !

టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో చేప పిల్లల పంపిణీ లేటవుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కూడా ప్రైవేటు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో చేప పిల్లలను అధిక ధరలకు కొనాల్సి వస్తుందేమోనని మత్స్యకారులు భయపడుతున్నారు. ఈ ప్రక్రియలో కొందరు అధికారుల తీరు వల్లే సర్కార్ ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.  ఇప్పటికే స్టార్ట్​కావాల్సిన ప్రక్రియ ఇంకా మొదలు కాకపోవడంతో మత్య్సకారులు సందిగ్ధంలో పడిపోయారు.