ఎన్ఐసీకి ధరణి చిక్కులు!. భూముల డేటా మొత్తం ప్రైవేట్ ​ఏజెన్సీ చేతుల్లోనే

ఎన్ఐసీకి  ధరణి  చిక్కులు!. భూముల డేటా మొత్తం ప్రైవేట్ ​ఏజెన్సీ చేతుల్లోనే
  • ధరణి సాంకేతికత, భూముల డేటా మొత్తం ప్రైవేట్ ​ఏజెన్సీ చేతుల్లోనే
  • ప్రస్తుతం ఉన్నది ఉన్నట్టు నిర్వహించడం సాధ్యం కాదంటున్న ఎన్ఐసీ
  • ఈ నెలాఖరుకల్లా ముగుస్తున్న ప్రైవేట్ ఏజెన్సీ కాంట్రాక్టు గడువు
  • ధరణిలో టెక్నికల్ ఎర్రర్స్ తో మూడ్రోజులుగా అప్లికేషన్లు పెండింగ్ 

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ ​నిర్వహణపై గందరగోళం నెలకొన్నది. ఈ నెలాఖరుతో ప్రైవేట్​ఏజెన్సీ టెర్రాసిస్​ కాంట్రాక్టు గడువు ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో అంతకుముందే ధరణి పోర్టల్ ​నిర్వహణను పూర్తిగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నది. అయితే సాఫ్ట్ వేర్​ను ట్రాన్సిస్ట్ ​చేసేందుకు టెక్నికల్​గా అనేక ఇబ్బందులు వస్తున్నట్టు తెలిసింది. మార్పులు చేయాలన్నా ఎన్ఐసీ ఢిల్లీ నుంచి అప్రూవల్​ తీసుకోవాల్సి ఉంటుంది. 

అదే సమయంలో సాఫ్ట్​వేర్​ను ఎన్ఐసీకి అప్పగించేందుకు ప్రైవేట్​ఏజెన్సీ రెడీ అయింది. అయితే సాఫ్ట్​వేర్​లోని కోడింగ్ వంటి వాటిపై ఎన్ఐసీకి ప్రైవేట్ ఏజెన్సీ సరైన సమాచారం ఇవ్వడం లేదని తెలిసింది. పైగా పూర్తిగా టెర్రాసిస్​ తయారు చేసిందే.. ఎన్ఐసీకి మార్పు జరుగుతున్నది. దీనిపైనా ఎన్ఐసీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ రకంగా సాఫ్ట్​వేర్​ట్రాన్సిస్ట్​చేస్తుంటే అవ్వడం లేదని.. పైగా ఇదంతా సెక్యూర్​కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ధరణి పోర్టల్ ప్రాథమిక సమాచారం ఇస్తే.. దానికి అనుగుణంగా డేటా ట్రాన్స్​ఫర్​ చేసుకుంటే సరిపోయేదని తెలిసింది. ధరణిలో అప్​డేట్​ చేస్తుండడంతో మూడు రోజులుగా సర్వర్ ​నిలిచిపోయింది. దీంతో అప్లికేషన్లు ఏవీ ప్రాసెస్ చేయలేదు. 

పెండింగ్​ అప్లికేషన్లపై సర్య్కులర్..

ధరణి పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదనపు కలెక్టర్‌, ఆర్డీవో స్థాయిలో పరిష్కారం కావాల్సిన ధరణి సమస్యల కోసం సీసీఎల్‌ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్​సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. ధరణి కమిటీ సూచనల మేరకు మార్గదర్శకాలను జారీ చేసినట్టు భూపరిపాలన విభాగం చీఫ్‌ కమిషనర్‌ వెల్లడించారు. ఫిబ్రవరి 28న సీసీఎల్‌ఏ ఇచ్చిన సర్క్యులర్‌కు లోబడి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్‌ స్థాయిలో మ్యుటేషన్‌, పట్టాదార్‌ పాస్‌ బుక్స్‌, నాలా కన్వర్షన్‌, పట్టాదారు పాస్‌ పుస్తకంలో సవరణలు తదితరాలు ఉన్నట్టు వివరించారు.దరఖాస్తులను తహసీల్దార్‌ పరిశీలించాక ఆర్డీవోకు పంపాల్సి ఉంటుంది. అదనపు కలెక్టర్‌కు ఆర్డీవో అప్‌లోడ్‌ చేయాలి. ఆర్డీవో, తహసిల్దార్ సిఫారసుల మేరకు అదనపు కలెక్టర్ వెరిఫై చేయాలి. సవరణను రిజెక్ట్ చేయాలనుకుంటే సరైన కారణాలు వెల్లడించాలి.

ALSO READ : జనవరిలో పంచాయతీ ఎన్నికలు?

ఎవరి స్థాయిలో ఏమున్నయంటే.. 

ఆర్డీవో స్థాయి: టీఎం 4–అసైన్డ్ భూముల విరాసత్, పాస్ బుక్ లేనప్పుడు. టీఎం 27–పెండింగ్ నాలా అప్లికేషన్లు. టీఎం 33–డిజిటల్ సంతకం, జీఎల్ఎం   అదనపు కలెక్టర్ స్థాయి: టీఎం 3–మ్యుటేషన్ దరఖాస్తులు. టీఎం 24– కోర్టు కేసుల ద్వారా పట్టాదారు పాసు పుస్తకాల జారీ. టీఎం 31–పాసు పుస్తకాల జారీ, ఇల్లు, ఇంటి స్థలం అని ఉన్న చోట నాలా కన్వర్షన్ చేయడం. టీఎం 33–పాసు బుక్ లో తప్పొప్పుల సవరణ. పేరు తప్పు పడినా అదనపు కలెక్టర్ చేయొచ్చు.