అధిష్టానం నుంచి తెలంగాణ నేతలకు ఎలాంటి పిలుపు లేదు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

అధిష్టానం నుంచి తెలంగాణ నేతలకు ఎలాంటి పిలుపు లేదు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద రాజకీయం పబ్బం గడుపుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ అబద్దాలకు మారుపేరుగా మారిపోయాడని విమర్శించారు. మునుగోడు ఎన్నికల సందర్భంగా గొర్రె కాపరులకు నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికల సందర్భంగా వారు డబ్బులు వేసి .. వాటిని ఫ్రీజ్ చేశాడని ఆరోపించారు. ఈరోజు నగదు బదులుగా గొర్రెలు ఇస్తామని అంటున్నాడన్న ఎంపీ.. మునుగోడులో నాలుగు వేల కుటుంబాలను సీఎం కేసీఆర్ దగా చేశాడని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు నాలుగు లక్షల మందికి గొర్రెల పంపిణీ జరగలేదని, రాష్ట్రంలో కుల వృత్తుల మీద ఆధారపడే వారిని మోసం చేస్తున్నాడని చెప్పారు. చేనేత వృత్తులను కూడా అవమాన పరుస్తున్నాడన్న ఆయన... రాష్ట్రంలో చేనేత వృత్తులపై జీఎస్టీ శాతం ఎందుకు తగ్గించట్లేదో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖం చాటేసాడని లక్ష్మణ్ కామెంట్ చేశారు. ఎరువుల ఫ్యాక్టరీ వల్ల తెలంగాణలో ఆరు లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుందన్నారు. సింగరేణినీ ప్రైవేటీకరణ చేసిందంటూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన.. సింగరేణి ప్రైవేటీకరణ చేసేది లేదని స్వయంగా ప్రధానే చెప్పారని గుర్తు చేశారు. 49 శాతం కేంద్రం వాటా, 50 శాతం రాష్ట్ర వాటా ఉంటే ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. సింగరేణిలో గత ఎనిమిదేళ్లలో ఒక్క ఉద్యోగమైనా కేటాయించారా అన్న లక్ష్మణ్.. సింగరేణిలో గత ఎనిమిది నెలల 20 వేల ఉద్యోగాలు తగ్గాయని చెప్పారు. రాజకీయ ప్రయోజనం కోసం లబ్దికోసం పిచ్చిపిచ్చి ఆరో పణలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పెద్ద పీట వేస్తోందని తెలిపారు.

అధిష్టానం నుంచి ఎలాంటి పిలుపు లేదు

అధిష్టానం నుంచి తెలంగాణ నేతలకు ఎలాంటి పిలుపు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రత్యేకంగా తెలంగాణ నేతలతో ఎలాంటి సమావేశము షెడ్యూల్ చేయలేదన్న ఆయన.. నిన్న, మొన్న పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ తో సమావేశాలు జరిగాయని చెప్పారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాలు మాత్రం జరుగుతున్నాయన్న ఆయన.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం తెలుగు నేతలను పిలిచి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వివరించారు.

సినీ నటుడు కృష్ణ మరణం తెలుగు సినిమాకు తీరని లోటు

సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమాకు తీరనిలోటని బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు. మూడు తరాల నటుడు.. అల్లూరి సీతారామరాజు అంటే గుర్తు చేసుకుంటారన్న ఆయన.. వారి కుటుంబానికి ఆత్మస్థైర్యం ఇవ్వాలని, కృష్ణ గారి ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.