నో ఛేంజ్.. అనుకున్న టైమ్‌‌‌‌కే ఎన్టీఆర్ ‘వార్ 2’

నో ఛేంజ్.. అనుకున్న  టైమ్‌‌‌‌కే ఎన్టీఆర్ ‘వార్ 2’

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న హిందీ చిత్రం ‘వార్ 2’.  అయాన్ ముఖ‌‌‌‌ర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్ రాజ్  ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ‘వార్’కి సీక్వెల్‌‌‌‌గా రాబోతున్న ఈ చిత్రం  ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు. 

అయితే రీసెంట్‌‌‌‌గా  షూట్‌‌‌‌లో హృతిక్ రోషన్ మోకాలికి గాయం కావడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిది. దీనిపై యష్  రాజ్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ‘వార్‌‌‌‌‌‌‌‌2’ రిలీజ్ డేట్‌‌‌‌లో ఎలాంటి మార్పు లేదని,  అనుకున్న టైమ్‌‌‌‌కు కచ్చితంగా ఆడియెన్స్ ముందుకు రాబోతోందని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేశారు.  

‘వరల్డ్​వైడ్​గా బీభత్సం సృష్టించేందుకు మేం ఆగస్టు 14న వస్తున్నాం’ అంటూ పోస్ట్ చేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కియారా అద్వానీ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.