బిల్లు కట్టలేదని.. ఊరికి కరెంట్ బంజేసిన్రు

బిల్లు కట్టలేదని.. ఊరికి కరెంట్ బంజేసిన్రు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీ అందకారంలోకి వెళ్లింది. కరెంట్ బిల్లులు కట్టాలని అధికారులు గ్రామస్థులకు నోటీసులు జారీ చేశారు. వారంలో కడతామని గ్రామస్థులు అధికారులను వేడుకున్నారు. అయితే వారి రిక్వెస్ట్ ను పట్టించుకోకుండా విద్యుత్ అధికారులు గ్రామానికి  కరెంట్ ను నిలిపివేశారు.  దీంతో విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కరెంట్ బిల్లులపై ఆదివాసీలకు అవగాహన కల్పించకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా  విద్యుత్ ను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.