సర్వైవ్ కావడానికి ఫార్ములా ఏవీ లేవు : రకుల్ ప్రీత్ సింగ్

సర్వైవ్ కావడానికి ఫార్ములా ఏవీ లేవు : రకుల్ ప్రీత్ సింగ్

చిన్న సినిమాలతో కెరీర్‌‌‌‌ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలకు జంటగా అవకాశాలు అందుకుంది. అందుకుతగ్గ విజయాలు కూడా రావడంతో స్టార్ హీరోయిన్‌‌గా రాణించింది. ఆ తర్వాత కొన్ని పరాజయాలు పలకరించడం, పైగా ఆమె బాలీవుడ్‌‌ సినిమాలపై ఫోకస్ పెట్టడంతో సౌత్‌‌లో సినిమాలు తగ్గాయి. జాకీ భగ్నానీతో పెళ్లి తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగింది.  మూడేళ్ల క్రితం వచ్చిన ‘కొండపొలం’ తర్వాత ఆమె ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. 

‘ఇండియన్ 2’ లాంటి తమిళ చిత్రాల్లో నటించినా నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్స్ కెరీర్‌‌‌‌ గురించి ఆమె చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో సస్టేన్ అవడానికి, సర్వైవ్ అవడానికి ఫార్ములాస్ అంటూ ఏవీ లేవని చెప్పింది రకుల్. టాలెంట్‌‌, డిమాండ్‌‌తో పాటు రిక్వైర్‌‌‌‌మెంట్ కూడా ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో ముందుకెళ్లగలమని ఆమె చెప్పింది. మనకు లభించే అవకాశాలు, అందులోని మన హార్డ్‌‌ వర్క్‌‌ని ప్రేక్షకులు చూస్తారని,  ఎప్పటికప్పుడు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని రకుల్ అభిప్రాయపడింది.  ఇక ప్రస్తుతం అజయ్ దేవగన్‌‌తో కలిసి ‘దే దే ప్యార్‌‌‌‌ దే’ చిత్రంతో పాటు ‘మేరే హజ్బండ్‌‌ కీ బీవీ’ అనే మరో చిత్రంలోనూ  రకుల్ హీరోయిన్‌‌గా నటిస్తోంది.