సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవు.. కానీ కమీషన్ల కాళేశ్వరానికి కొదవలేదు

 సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవు.. కానీ కమీషన్ల కాళేశ్వరానికి కొదవలేదు

హైదరాబాద్: ధనిక రాష్ట్రమని గప్పాలు కొట్టే సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. ‘ గ్రామ పంచాయతీలకు ఇవ్వడానికి పైసల్ లేవు.. ఉద్యోగుల జీతాలకు పైసల్ లేవు.. వడ్లు కొనేందుకూ పైసల్ లేవు.. కొత్త పెన్షన్లు ఇవ్వడానికీ డబ్బులు లేవు.. సంక్షేమ పథకాలకూ డబ్బులు లేవు.. కమీషన్ల కాళేశ్వరానికి మాత్రం కొదవలేదు.. ’ అని ఆమె మండిపడ్డారు. 
మ‌ద్ద‌తు ధ‌ర అంటే రైతుల‌కు లాభ‌మొచ్చే ధ‌ర కాదు. క‌నీస ధ‌ర మాత్ర‌మే. అది కూడా ఇవ్వ‌లేని దిక్కుమాలిన ప్ర‌భుత్వ‌మిది..’ అంటూ ఆమె ట్వీట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి

కోనాపూర్ కు ఏమడిగితే అదివ్వాలని కేసీఆర్ అన్నరు

నారాయణను చిత్తూరుకు తరలించిన పోలీసులు