స్కూళ్లలో ట్యాంకులను శుభ్రం చేసే వారేలేరు

స్కూళ్లలో ట్యాంకులను శుభ్రం చేసే వారేలేరు
  • భగీరథ నీరు నింపుతున్నా రోజుల కొద్దీ నిల్వ ఉంచుతున్నరు
  • ప్లేట్లు కడుక్కోవడానికి తప్ప తాగేందుకు వాడని స్టూడెంట్లు
  • ఇళ్ల నుంచే బాటిళ్లు ఇచ్చి పంపుతున్న తల్లిదండ్రులు

మహబూబ్​నగర్, వెలుగు: వానాకాలం కావడంతో నిల్వ ఉన్న నీటిని పారబోసి, ఏ రోజు నీటిని ఆ రోజే తాగాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా  సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.   కనీసం పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో ట్యాంకులను కూడా శుభ్రం చేయడం లేదు.  అందులో మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ నీటిని నింపుతున్నా.. రోజుల కొద్దీ నిల్వ ఉంచుతుండడంతో స్టూడెంట్లెవరూ తాగడం లేదు.  వలం కాళ్లు, చేతులు, ప్లేట్లు, గ్లాసులు కడుక్కోవడానికే వాడుతున్నారు.  తాగడానికి ఇళ్ల నుంచే వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిళ్లు తెచ్చుకుంటున్నామని స్టూడెంట్లు, టీచర్లు చెబుతున్నారు.  మండల కేంద్రాల్లో ఉండే టీచర్లు మాత్రం వాటర్​క్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వేయించుకుంటున్నారు. 

జిల్లాలో 835 బడులు
మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 835 ప్రభుత్వ బడులు ఉండగా..  ఇందులో 612 ప్రైమరీ స్కూళ్లు,  87 అప్పర్​ ప్రైమరీ స్కూళ్లు, 136 హైస్కూళ్లు ఉన్నాయి.  వీటన్నిటికీ మిషన్​ భగీరథ కనెక్షన్లు ఉన్నాయని, రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తోందని ఎడ్యుకేషన్​ ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే నల్లా పొద్దంతా వచ్చే అవకాశం లేకపోడంతో నీటిని ట్యాంకులు, సంపుల్లోకి స్టోర్​ చేస్తున్నారు. ‘భగీరథ’ రాని రోజు పంచాయతీ బోర్ల నీటిని నింపుతున్నారు. ఎక్కువ రోజులు అలాగే ఉంచుతుండడంతో దుర్వాసన వస్తోందని, అందుకే తాగడం లేదని స్టూడెంట్లు చెబుతున్నారు. 

ఇలా చేయట్లే..
భగీరథ ద్వారా ఫిల్టర్​ నీటిని ట్యాంకుల్లో నింపుతున్నా మెయింటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం చేయడం లేదు. వారానికోసారి ట్యాంకులు, సంపుల్లో ఉన్న నీటిని ఖాళీ చేయాలి.  బ్లీచింగ్​ పౌడర్​తో కడిగి శుభ్రం చేయడంతో పాటు క్లోరిన్​ ట్యాబెట్లు వేసి పెట్టుకోవాలి. వానాకాలం ప్రారంభంలోనే ట్యాంకు లోపల భాగంలో సున్నం కొట్టాలి ట్యాంకు చుట్టూ పరిసరాలను శభ్రం చేయాలి. కానీ, జూన్​లో స్కూళ్లు రీఓపెన్​ చేసినప్పుడు మాత్రమే పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించారు. 
మళ్లీ ఇప్పటికే వరకు పట్టించుకోలేదు.  కొన్ని బడుల్లో తొమ్మిది, పదో తరగతి స్టూడెంట్లతో ట్యాంకులను క్లీన్​ చేయిస్తున్నట్లు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంలే  స్వయంగా చెబుతున్నారు. జీపీ కార్మికులకు వేరే పనులు ఉండడంతో స్కూళ్లపై దృష్టి పెట్టడం లేదని, స్కావెంజర్లు ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. కాగా, గవర్నమెంట్​స్కూళ్లలో తాగునీటి పరిస్థితిపై పాలమూరు డీఈవోను సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి  రాలేదు. 

అసంపూర్తిగా పనులు

‘మన ఊరు-మన బడి’ ఫస్ట్​ ఫేస్​ కింద రూ.3.6 కోట్లతో 233 బడుల్లో తాగునీటి ఏర్పాట్ల కోసం పనులు జరుగుతున్నాయి. స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ట్యాంకులు, సంపులు, కొళాయిల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులను బడులు రీఓపెన్​ వరకు పూర్తి చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నా..సర్కారు  టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బడ్జెట్​అలాట్​చేయకపోవడంతో ఆలస్యం అయ్యింది. 
టెండర్లు కూడా లేట్​కావడంతో బడులు తెరిచాక పనులు స్టార్ట్​ చేశారు.  ప్రస్తుతం వర్షాలు పడుతుంటంతో రెండు వారాలుగా కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు.  ఈ పనులు కంప్లీట్​అయ్యేందుకు నాలుగు నెలల టైం పట్టే అవకాశం ఉంది.

మా స్కూల్ లో మినరల్ వాటర్ లేదు 

మా స్కూల్ లో మినరల్ వాటర్ లేదు. తాగే నీళ్లను ఇంటి నుంచి తెచ్చుకోమని మా హెడ్మాస్టర్ చెప్పిండు. అప్పటి నుంచి ఇంటి నుంచే వాటర్ బాటిళ్లను తెచ్చుకుంటున్నం. ఒకవేళ నీళ్లు అయిపోతే పక్కనే ఉన్న జూనియర్ కాలేజీకి వెళ్లి తెచ్చుకుంటున్నం.  - జావేద్, 9వ తరగతి, జడ్పీహెచ్ఎస్, మిడ్జిల్
 
ట్యాంక్​ చుట్టూ క్లీన్​గా లేదు

మా బాబు మిడ్జిల్​ జడ్పీహెచ్​ఎస్​లో తొమ్మిదో తరగతి చదువుతున్నడు. అక్కడ తాగేందుకు నీళ్లు లేవు. ట్యాంకు ఉన్నా.. చుట్టూ నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లేదు. లోపల కూడా కడుగుతలేరు.  అవితాగితే లేనిపోని రోగాలు వస్తయి. అందుకే  ఇంటి నుంచే తాగునీటిని బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోసి పంపిస్తున్న. -గీత, స్టూడెంట్​ భరత్​ తల్లి, మిడ్జిల్

ఇంటి నుంచే తెచ్చుకుంటున్నం

నేను స్కూళ్లో ఉన్న నీళ్లను తాగుతలే. నాతో పాటు అందరూ ఇంటి నుంచే బాటిళ్లు తెచ్చుకుంటున్నరు. పోయిన ఏడాది కూడా గిట్లనే  తెచ్చుకున్నం.  ఇప్పుడు స్కూళ్లో కొత్తగా సంపు కడుతున్నరు. అది ఇంకా కంప్లీట్​ కాలె.  ఫ్రెష్​ వాటర్​ను సఫ్లై చేసే అందరం వాటినే తాగుతం. - జ్ఞానేశ్​, 10వ తరగతి,  జడ్పీహెచ్​ఎస్​, ఎన్మన్​గండ్ల