ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ ఆత్మహత్యలో రాజకీయాలు లేవు : ఎస్పీ శ్రీథర్

ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ ఆత్మహత్యలో రాజకీయాలు లేవు : ఎస్పీ శ్రీథర్

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వార్త సినిమా అభిమానుల్లో విషాదాన్ని నింపింది. అయితే శ్యామ్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు శ్యామ్ తల్లిదండ్రులు. అంతేకాదు శ్యామ్ మరణం వెనుక రాజకీయ కోణం కూడా ఉండనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో కోనసీమ జిల్లా ఏస్పీ శ్రీధర్ మీడియా ప్రకటన విడుదల చేశారు. టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లు ప‌చ్చి అబ‌ద్ధం అని, శ్యామ్ ఆత్మ‌హ‌త్యకు ప్రేమ వ్య‌వ‌హారం, చ‌దువుల్లో వెనుక‌బాటుత‌న‌మే కార‌ణం అని స్పష్టం చేశారు.    

ALSO READ:ఒక్క డిజాస్టర్.. స్టార్డమ్ ఔట్.. టైర్2 హీరోతో సురేందర్ రెడ్డి    

పోలీసులు ద‌ర్యాప్తు, వైద్యుల నివేదిక ప్ర‌కారం... మృతుడు శ్యామ్ జూన్ 25 సాయంత్రం 9 గంట‌ల నుంచి మ‌ర్నాడు ఉద‌యం 6 గంట‌ల‌లోపు చ‌నిపోయి ఉంటాడ‌ని వైద్యులు నిర్ధారించారు. శ్యామ్ చేతి మ‌ణిక‌ట్టును బ్లేడుతో కోసుకున్న‌ట్టు వైద్యులు గుర్తించారు. అందుకు వాడిన బ్లేడు కూడా అతడి జేబులోనే దొరికింది. మ‌ణిక‌ట్టును కోసుకున్న అనంత‌రం ఉరేసుకుని చ‌నిపోయి ఉంటాడ‌ని పోస్టుమార్టం నిర్వ‌హించిన‌ వైద్యులు నిర్ధారించారు. అనంత‌రం మృత‌దేహాన్ని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు.