ప్రాక్టీస్ మ్యాచ్ అక్కర్లేదు. భారత్ కు భయపడం

ప్రాక్టీస్ మ్యాచ్ అక్కర్లేదు. భారత్ కు భయపడం

ఫిబ్రవరిలో నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు భారత పర్యటణకు వస్తున్న ఆస్ట్రేలియా, టీమిండియాను ఓడిచేందుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుందని హెడ్ కోచ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అన్నాడు. దాంట్లో భాగంగానే ఆస్ట్రేలియా ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడకుండా డైరెక్ట్ బరిలోకి దిగుతుందని ఆండ్రూ స్పష్టం చేశాడు. అందుకు సిరీస్ ప్రారంభం కావడానికి కేవలం వారం రోజుల ముందు భారత్ కి రాబోతున్నారు.

గత కొన్ని సిరీస్లనుంచి ఆస్ట్రేలియా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది. సిరీస్ ప్రిపరేషన్ పరంగా ఆటగాళ్లపై  ఎక్కువ ఒత్తిడి చేయకూడదనేది దీని ఉద్దేశం. పాకిస్థాన్ పర్యటనలో ఇలానే చేసి సక్సెస్ అయింది. ‘మేము ఎప్పటికప్పుడు క్రియేటివ్‌గా ఉండగలం. పాకిస్థాన్‌తో సిరీస్‌లోనూ ఇదే చేశాం.  భారత ప్రర్యటనలో ఇదే చేస్తాం. అక్కడి పరిస్థితులకు భయపడం. లోకల్ గ్రౌండ్ మెన్ సాయంతో కలిసి పనిచేసి, ప్రాక్టీస్ గేమ్ లేకుండానే ఆడగలమని భావిస్తున్నామ’ని ఆండ్రూ అన్నాడు.