- కౌన్సిలర్లతో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఆదివారం జరిగిన కౌన్సిల్ మీటింగ్‌లో చైర్పర్సన్ మంజుల, అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చైర్మన్పదవి కోసం పోటీ ఏర్పడటంతో రెండున్నరేండ్లు పదవిలో ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. రెండున్నరేండ్ల గడువు గత నెల 27న ముగియడంతో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్‌తో కౌన్సిల్ మీటింగ్‌లో జరిగిందని తెలుస్తోంది.
‘తాము ఒప్పుకోకపోతే మున్సిపల్ చైర్మన్ అయ్యేదానివా’ అంటూ మున్సిపల్ చైర్ పర్సన్ మంజులను కౌన్సిలర్లు పుష్పలతారెడ్డి, అనంత్ రెడ్డి నిలదీశారు. రెండున్నరేండ్లు పూర్తయినా పదవికి రాజీనామా చేయకుండా అవమానిస్తున్నావ్, ఒప్పందం ప్రకారం రాజీనామా చేయాలని.. లేకుంటే తామే దించేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ మంజుల.. కుర్చీ తనకేమీ వట్టిగా ఇవ్వలేదని, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే కూర్చోబెట్టారని, తాను కుర్చీ దిగే ప్రసక్తే లేదని ప్రకటించారు.