కొత్త బీసీ గురుకులాల్లో గెస్ట్ టీచర్లతోనే టీచింగ్!

కొత్త బీసీ గురుకులాల్లో గెస్ట్ టీచర్లతోనే టీచింగ్!

రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటవుతున్న మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో తొలి ఏడాది గెస్ట్‌‌‌‌ టీచర్లతోనే పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది .2019–20 విద్యా సంవత్సరా నికి గాను ప్రభుత్వంకొత్తగా 119 బీసీ రెసిడెన్ షియల్‌‌‌‌ స్కూళ్ల ఏర్పాటు-కు ఇటీవల అనుమతి ఇచ్చిం ది. దీంతో ఐదు,ఆరు, ఏడు తరగతుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌‌‌‌ వచ్చిం ది. జూన్‌‌‌‌ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంది. ఈ గురుకులాల్లో రెగ్యులర్‌‌‌‌ టీచర్ల భర్తీకి కేబినెట్‌‌‌‌ అనుమతి ఇచ్చినా ఆర్థిక శాఖ నుంచి తుది ఉత్తర్వులు జారీకాలేదు.ఫలితంగా తొలి ఏడాది బోధనకు గెస్ట్‌‌‌‌ టీచర్లను నియమించు కునేందుకు గురుకుల అధికారులు సిద్ధమవుతున్నా రు.

ఇవీ సమస్యలు

2019–-20 విద్యాసంవత్సరానికి గాను బీసీ గురుకులాల్లో 1,904 రెగ్యు లర్‌‌‌‌ టీచింగ్‌ , నాన్‌‌‌‌ టీచింగ్‌స్టాఫ్‌ , సొసైటీ సెక్రటరీ కార్యాలయంలో 28 రెగ్యులర్‌‌‌‌ పోస్టుల భర్తీకి గురుకుల విద్యాలయ సంస్థరిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డ్‌‌‌‌ వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చిభర్తీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. మంజూరు చేసిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ తుది ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో బీసీ గురుకుల సొసైటీ ఈ పోస్టులను నోటిఫై చేయలేదు. ఎన్నికల కోడ్‌ కారణంగా మే నెలాఖరు నాటికి ఈ పోస్టులకు తుది అనుమతి,నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. ఇక, కొత్తప్రెసి డెన్ షియల్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌కు అనుగుణంగా ఉద్యోగాల కేడర్‌‌‌‌ ఫిక్సేషన్‌‌‌‌ అంశం సైతం పెండింగ్‌ లోఉంది. గురుకులాల్లో భర్తీ చేసే ప్రిన్సిపాల్ , పీజీటీ,టీజీటీ, ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ టీచర్, లైబ్రేరియన్, ఆర్ట్‌‌‌‌, క్రాఫ్ట్‌‌‌‌, మ్యూజిక్‌ ఇన్‌‌‌స్ ట్రక్టర్ , స్టాఫ్‌ నర్స్‌‌‌‌,సీనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌, జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ కమ్‌టైపిస్ట్‌‌‌‌ పోస్టులు ఏ కేడర్‌‌‌‌లోకి వస్తాయో సొసైటీలే నిర్ణయించాల్సి ఉంది. కేడర్‌‌‌‌పై క్లారిటీ కోసం సొసైటీలు ఇదివరకే సంబంధిత శాఖలకు లేఖలు రాసినా ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో రెగ్యు లర్‌‌‌‌ పోస్టులకు ఇప్పట్లో నోటిఫికేషన్‌‌‌‌ వచ్చే అవకాశం కనిపించడం లేదు.