హిమాలయాల్లోని గ్లేసియర్లు కరిగి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో పాకిస్తాన్లో భారీ వరదలు సంభవించాయని, దాంతో పెద్ద మొత్తంలో ఇండ్లు మునిగాయని వార్తలొచ్చాయి. గ్లోబల్ వార్మింగ్‌తో హిమాలయ పర్వతాల్లో హిమనీ నదాలు(గ్లేసియర్లు) శరవేగంగా కరిగిపోతున్నాయని, దీన్ని ఇండియాలోని ఓ ఐఐటీ పరిశోధకులు గుర్తించినట్లు కథనాలు వెలువడ్డాయి. హిమాలయాల్లో మంచు కరగడం వల్లే పాకిస్థాన్‌లో భారీ వరదలు వచ్చాయనేది తప్పుడు ప్రచారం. ఈ విషయాలను ప్రతిష్టాత్మక ఐఐటీ పరిశోధకులు చెప్పారనడం.. ఆ సంస్థను దిగజార్చడమే అవుతుంది.
లానినో- ఎలినినో ప్రభావం
సహజసిద్ధంగా లాలినో–ఎలినినో ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి/అనావృష్టి వస్తే మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి/అతివృష్టి ఏర్పడతాయి. కొంతకాలం అనావృష్టి మరి కొంతకాలం అతివృష్టి కొనసాగడం సర్వసాధారణం. ఉదాహరణకు మన దేశ ఏడాది సగటు వర్షాతం 60 సంవత్సరాల వలయంగా ఉంది. దక్షిణ ఆఫ్రికా దేశంలో ఇది 66 సంవత్సరాలు, బ్రెజిల్లో 52 సంవత్సరాల వలయంగా ఉంది. ఎలినినో–లానినో లాంటి వాటివల్ల వీటిలో మార్పులు జరుగుతాయి. మూడు ఉదాహరణలను చూస్తే ఈ 60 సంవత్సరాల వలయానికి సంబంధించి స్పష్టంగా ఒక అవగాహనకు రావొచ్చు.
చెట్ల వలయాల ఆధారంగా..
2002లో ముకుంద్పాలట్రావు తదితరులు అతివృష్టి, అనావృష్టిలను అంచనా వేసేందుకు చెట్లలో ఉండే వలయాలను ఆధారం చేసుకున్నారు.1309 నుంచి 2004 వరకు బ్రహ్మపుత్రానది నీటి ప్రవాహాన్ని వారు అంచనా వేశారు. దీని ప్రకారం60 సంవత్సరాల వలయంలో 1957–58 నుంచి 1986–87 వరకు,1830–60 వరకు అనావృష్టి ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణంపై 2009లో విడుదల చేసిన రిపోర్టులో కూడా.. చినాబ్, రావి, బీయస్నదులలో ఉన్న వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సంవత్సరాల సంఖ్యను 60 సంవత్సరాల వలయంలో గుర్తించింది. గోదావరి నది నీటి ప్రవాహం విషయంలో ఈ 60 సంవత్సరాల వలయాన్ని బట్టి చూడొచ్చు.
గ్లేసియర్ల విషయానికొస్తే..
హిమాలయాల్లో ఉన్న గ్లేసియర్లు 2035 నాటికి కనుమరుగై పోతాయని ఐపీసీసీ ఏఆర్4 రిపోర్టులో ఉటంకించింది. కాగా ఐదు సంవత్సరాల్లో గ్రీన్‌ల్యాండ్ మంచు రహితంగా మారుతుందని అమెరికా మాజీ వైఎస్ప్రెసిడెంట్పర్యావరణ వేత్త అల్గోరే పేర్కొన్నారు. వీళ్లు ఇచ్చింది తప్పుడు రిపోర్టు అని మేము యూఎన్ కు, ఆయా ప్రభుత్వాలకు లెటర్రాసి తెలియజెప్పాం. దానికి ఐపీసీసీ చైర్మన్ మాపై విరుచుకుపడ్డారు. ప్రెస్‌మీట్‌పెట్టి మాది సూడో సైన్స్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి రిపోర్టుకు గానూ 2007లో ఐపీసీసీకి, అల్గోరేకు సంయుక్తంగా నోబెల్‌బహుమతి వచ్చింది. ఆ ప్రైజ్తాలూకు డబ్బు జేబుకు చేరే వరకు వేచి ఉన్న వాళ్లు.. చేతికందిన తర్వాత తప్పు ఒప్పుకున్నారు. రిపోర్టులో తాము చెప్పిన విషయాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి, క్షమాపణలు అడిగారు. అయితే నోబెల్బహుమతిని మాత్రం వెనక్కి ఇవ్వకపోవడం గమనార్హం.
పార్లమెంట్‌కు చెప్పిన మంత్రి
హిమాలయాలపై 2000 సంవత్సరం నుంచి 2011 వరకు అధ్యయనం చేసిన ఓ సంస్థ 2014లో ఓ రిపోర్టు విడుదల చేసింది. 2181 వరకు హిమాలయాల్లోని గ్లేసియర్లలో 86.6 శాతం ఎలాంటి మార్పు ఉండదని ప్రకటించింది. ఇదే విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి 2015 డిసెంబర్లో తన ప్యారిస్పర్యటన తర్వాత సాక్షాత్తు పార్లమెంట్‌కు చెప్పారు. కాబట్టి హిమాలయాల్లోని గ్లేసియర్లు కరిగి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో పాకిస్తాన్లో భారీ వరదలు సంభవించాయని చెప్పడం కరెక్ట్ కాదు.
- సజ్జల జీవానంద రెడ్డి, ఎన్విరాన్మెంటలిస్ట్