- ఉన్న మూడు మెడికల్ షాపులు ప్రైవేటువే..
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో రోజూ వేల మంది రోగులు వచ్చే నిమ్స్ దవాఖాన ఆవరణలో ఒక్కటంటే ఒక్క జనరిక్ మెడికల్ షాపు లేదు. హాస్పిటల్లో ఉన్న మూడు మెడికల్ షాపులు ప్రైవేటువే. దీంతో ఇక్కడికి పేషెంట్లు వేలల్లో ఖర్చుపెట్టి మందులు కొనాల్సి వస్తోంది. ప్రైవేటుతో పోల్చితే జనరిక్ మెడిసిన్స్ 80 శాతానికి పైగా తక్కువ ధరకు దొరుకుతాయి. దీనివల్ల పేద రోగులకు లబ్ధి చేకూరుతుంది. గాంధీ, ఉస్మానియా లాంటి దవాఖానల్లో జనరిక్ మెడికల్ స్టోర్స్ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నా నిమ్స్‌లో మాత్రం ఆ సేవలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మందులకే రూ.4 వేలు..
నేను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. మూడేండ్ల నుంచి నిమ్స్‌కు వస్తున్నా. కేవలం మందులకే రూ.4 వేలు ఖర్చువుతోంది . ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా. జనరిక్ మెడికల్ షాపుంటే నాలాంటి పేదవాళ్లకు మేలు చేసినట్టవుతుంది.
- అంబదాస్, నారాయణ పేట జిల్లా
అవగాహన లేమి కారణంగానే..
పేషెంట్లు బ్రాండెడ్ మందులు రాయమని అడుగుతున్నరు. వారికి జనరిక్ మెడికల్ షాపులంటే అవగాహన లేదు. వారికి అవేర్నెస్ లేకుండా నిమ్స్ ఆవరణలో జనరిక్ మెడికల్ షాపు ఏర్పాటు చేస్తే ఫలితం ఉండదు.
- సత్యనారాయణ, నిమ్స్ సూపరింటెండెంట్