కామారెడ్డి, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ సంప్రదాయ వైద్య ఆస్పత్రులకు బిల్డింగ్స్కరువయ్యాయి. కామారెడ్డిలో హోమియోపతి, నేచురోపతి, ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ మూడింటిని ఒకే రూమ్లో ఏర్పాటు చేశారు. దేశీయ వైద్యం చేయించుకోవడానికి కూడా చాలా మంది పేషంట్లు వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు ఫోకస్పెట్టి మూడు సంప్రదాయ వైద్యాలకు వేర్వేరుగా బిల్డింగ్స్నిర్మించాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.