టెన్షన్.. టెన్షన్ : అరెకపూరడి గాంధీ ఇంటి దగ్గర బీఆర్ఎస్ నిరసన

టెన్షన్.. టెన్షన్ : అరెకపూరడి గాంధీ ఇంటి దగ్గర బీఆర్ఎస్ నిరసన
  •  చొచ్చుకు వెళ్లేందుకు కార్యకర్తల యత్నం
  •  గులాబీ శాసన సభ్యుల హౌస్ అరెస్టు
  •  కుత్బుల్లాపూర్ లో కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు
  •  గాంధీ ఇంటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం

హైదరాబాద్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని లోనికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్బంగా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఇవాళ గాంధీ నివాసంలో పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గాంధీ నివాసానికి బయల్దేరిన ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

ALSO READ | 14 ఏళ్ల ఉద్యమంలో కూడా ఇలాంటి అణిచివేత చూడలేదు : ఎమ్మెల్యే హరీష్ రావు 

జిల్లాల నుంచి ఎవరూ రాకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి గాంధీ ఇంటికి బయల్దేరేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తాము గాంధీని శాలువతో సన్మానిస్తామని తెలిపినా పోలీసులు వినలేదు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్తితి నెలకొంది.