ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్తత నెలకొంది. నాస్తికుడు బైరి నరేష్ ను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. దీంతో అయ్యప్ప భక్తులకు బైరి నరేష్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో అయ్యప్ప భక్తుడు నరసింహరావుపైకి బైరి నరేస్ వాహనం దూసుకెళ్లడంతో స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
దీంతో నిరసన కు దిగారు అయ్యప్ప భక్తులు. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేవారు. బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.