ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రావడంతో సీపీఎం కార్యకర్తలు గ్రామానికి భారీగా చేరుకున్నారు. టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య తర్వాత తొలిసారి తెల్దారుపల్లికి వీరభద్రం రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కృష్ణయ్య హత్య కేసులో వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. వీరభద్రం రాకతో కృష్ణయ్య కుటుంబం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
కృష్ణయ్య కూతురు తమ్మినేని వీరభద్రంపై చెప్పులు వేసే ప్రయత్నం చేయడంతో కాసేపు హైటెన్షన్ నెలకొంది. పోలీసులు తమను ఎందుకు నిర్బందిస్తున్నారని కృష్ణయ్య కూతురు వాగ్వాదానికి దిగారు. కేవలం డబ్బుల కోసమే నీచమైన హత్యా రాజకీయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదని.. తమ తండ్రికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని అన్నారు.