గురుగ్రామ్లో దారుణం.. భార్య చేతిలో ఏఎస్ఐ హత్య

 గురుగ్రామ్లో దారుణం.. భార్య చేతిలో ఏఎస్ఐ హత్య

గురుగ్రామ్ లో దారుణం జరిగింది. ఓ పోలీస్ అధికారి భార్య.. తన భర్త చేతిలో ఉన్న తుపాకీని లాక్కుని కాల్చి చంపింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం నిందితురాలు పోలీసుల అదుపులో ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గురుగ్రామ్ లో గురువారం (నవంబర్ 2వ తేదీన) దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. రైల్వే పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ రాజ్ బీర్ ను అతని భార్య ఇంట్లోనే కాల్చి చంపింది. రాజ్ బీర్.. రేవారి రైల్వే స్టేషన్‌లోని జీఆర్‌పీలో విధులు నిర్వహిస్తున్నాడు. గురుగ్రామ్‌లోని షికోపూర్ గ్రామంలో భార్య ఆర్తి, కుమారుడు అను అలియాస్ యష్‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. 

గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో రాజ్‌బీర్‌, ఆర్తీ మధ్య గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆర్తి... తన భర్తపై తుపాకీతో కాల్పులు జరిపింది. ఈ  ఘటనలో ఆమె కూడా గాయపడింది. 

రాజ్ బీర్ మర్డర్ విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. క్లూస్ టీం పలు కీలక ఆధారాలను సేకరించింది. రక్తపు మడుగులో పడి ఉన్న రాజ్ బీర్ ను దగ్గరలోని ప్రభుత్వ మార్చురీకి తీసుకెళ్లారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ బీర్ కుమారుడి పాత్రపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తపై కాల్పులు జరిపిన సమయంలో గాయపడ్డ ఆర్తిని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. నేరానికి ఉపయోగించిన ఆయుధం కంట్రీ మేడ్ పిస్టల్ అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

భూ వివాదం నేపథ్యంలోనే తమ సోదరుడిని ఆయన కుమారుడు చంపేశాడని రాజ్ బీర్ సోదరుడు సత్బీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తులను తనపేరుపై రాయాలంటూ ఒత్తిడి చేసేవాడని, అందులో భాగంగానే ఈ హత్య జరిగిందని చెప్పాడు.