వరంగల్లో రౌడీషీటర్ దారుణహత్య.. ప్రత్యర్థుల పనేనా..?

వరంగల్ నగరంలో దారుణం జరిగింది. శివనగర్ కు చెందిన రౌడీషీటర్ నజీర్ దారుణ హత్యకు గురయ్యాడు. నజీర్ ను చంపిన తర్వాత నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. నజీర్ ప్రత్యర్థులే అతడ్ని చంపి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కొంతకాలంగా నజీర్..  సమోసా క్యాంటీన్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వరంగల్ నగరంలో నిత్యం ఏదో ఒకచోట గొడవలు, మర్డర్లు జరుగుతుండడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.