మానేరులో నీళ్లు ఉన్నాయ్.. మేం తోడేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తుండ్రు..

కరీంనగర్ లో నీటి ఎద్దడి ఉందని ఒక అపోహ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వర్షాభావం వల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని చెబితే దానిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 3 నెలల్లోనే తామేదో నీటిని మొత్తం తోడేసినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. కరీంనగర్ ప్రజలకు ఎక్కడ కూడా నీటి కొరత రాకుండా చూసే బాధ్యత తమదని చెప్పారు. నీటిని పోదుపుగా వాడుకోవడం పొరపాటు కాదని ఇప్పుడు నీటిని పొదుపుగా వాడుకుంటే వర్షాలు కురిసే వరకు కూడా తాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు.  

వేసవి కాలం దృష్ట్యా  తాగు,  సాగు నీటికి నీటి ఎద్దడి రాకుండా ఉండడానికి రైతుల పంటలకు కూడా ఇబ్బందులు లేకుండా నీరు అధించాలని  ఇప్పటికే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. మంత్రి ఉత్తమ్ సైతం సానుకూలంగా స్పందించారని తెలిపారు. తాగు నీటికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేవని ఇప్పటికే శ్రీరాం సాగర్ నుండి 3 టీఎంసీల నీళ్ళు మిడ్ మానేరు కు చేరుకున్నాయని ప్రస్తుతం మిడ్ మనేరు లో 12 టీఎంసీల వాటర్ ఉన్నాయని పొన్నం తెలిపారు. లోవర్ మానేర్ లో ప్రస్తుతం 7.5 టీఎంసీల వాటర్ ఉన్నాయని చెప్పారు.

ALSO READ :-పరిశ్రమల్లో కార్మికులను కాపాడాల్సిన అవసరం యాజమాన్యంపై ఉంది: కొండా సురేఖ

 మిడ్ మానెరు నుంచి ప్రస్తుతం సాగు నీరు కోసం నీటిని విడుదల చేస్తున్నామని ఏప్రిల్ 11 నుంచి మిడ్ మానరు నుండి లోవర్ మానేర్ కి తాగు నీటి కోసం 2 టీఎంసీల నీటి విడుదల ఉంటుందని తెలిపారు. ఇప్పుడున్న నీరు జూలై 30 వరకు తాగు నీటికి వినియోగంగా ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టులకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు.