- హెల్త్ మినిస్టర్ పైనే ఆశలు
మెదక్, తూప్రాన్, వెలుగు: 'పేరు గొప్ప ఊరు దిబ్బ' అన్నట్టుగా ఉంది జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి. పేరుకు పెద్ద హాస్పటిల్స్ ఉన్నా ఇక్కడ అందే సేవలు అంతంత మాత్రమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ ను అప్ గ్రేడ్ చేసింది కానీ అందుకు అనుగుణంగా స్పెషలిస్ట్ డాక్టర్లను, స్టాఫ్ ను నియమించలేదు.
చికిత్సలకు అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చలేదు. బీఆర్ఎస్హయాంలో హెల్త్ మినిస్టర్‌గా హరీశ్‌రావు ఉన్నప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆందోల్ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ హెల్త్మినిస్టర్అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ పై ప్రత్యేక దృష్టిపెట్టి అవసరమైన డాక్టర్లను, ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తూప్రాన్ సీహెచ్‌సీలో..
ఇదివరకు ఇక్కడున్న పీహెచ్ సీ ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీ హెచ్ సీ) గా అప్ గ్రేడ్ చేశారు. 50 బెడ్స్ ఉన్న ఈ హాస్పిటల్లో పూర్తిస్థాయి డాక్టర్లు, స్టాఫ్, పరికరాలు లేక రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. ఈ హాస్పిటల్లో ఈఎన్టీ స్పెషలిస్ట్లతోపాటు, ఆయా విభాగాలకు అవసరమైన పరికరాల కొరత ఉంది. డయాలసిస్‌సెంటర్, ట్రామాకేర్ సెంటర్ అవసరముంది. లేటెస్ట్ ఆల్ట్రాసౌండ్ మిషన్‌తోపాటు, రేడియాలజిస్ట్ ను నియమించాలి.
నర్సాపూర్ ఏరియా హాస్పిటల్లో..
వంద బెడ్స్ స్థాయికి అప్ గ్రేడ్ అయిన ఈ హాస్పిటల్లో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్స్టాఫ్ కొరత ఉంది. అలాగే సిటీ స్కాన్ మిషన్, సెల్ కౌంట్మిషన్, ఫొటో థెరఫీ యూనిట్ అవసరం ఉంది. కంప్యూటర్లు, ఆఫీస్ టేబుల్స్, కుర్చీలు కూడా అవసరం ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్ కోసం పర్మిషన్ రావాల్సి ఉంది.
రామాయంపేట సీహెచ్‌సీలో..
పీహెచ్సీ నుంచి సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ అయిన ఈ హాస్పిటల్‌కు రెగ్యులర్ క్యాడర్ స్ట్రెంత్ మంజూరు కాలేదు. రేడియాలజిస్ట్, ఈఎన్టీ, ఐ స్పెషలిస్ట్ డాక్టర్లు, డయాలసిస్ సెంటర్, లేటెస్ట్ ఆల్ట్రాసౌండ్ మెషీన్, సీ-ఆర్మ్ మిషన్, బేబీ వార్మర్, ఫొటో థెరఫీ యూనిట్, డెంటల్ చైర్, అంబులెన్స్, డెడ్ బాడీ ఫ్రీజర్బాక్స్, జనరేటర్అవసరం ఉన్నాయి.
కౌడిపల్లి సీహెచ్‌సీలో..
పీహెచ్సీ నుంచి సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ అయిన ఈ హాస్పిటల్‌కి రెగ్యులర్క్యాడర్స్టెంత్ మంజూరు కాలేదు. అదనపు డాక్టర్లతో పాటు, అంబులెన్స్, డేటాఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్ అవసరం ఉంది.
జిల్లా హాస్పిటల్లో..
గతంలో మెదక్ లో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ మాత్రమే ఉండేది. 2016లో మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటయ్యాక ఈ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్‌గా అప్ గ్రేడ్ అయింది. ఐసీయూ, బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ సెంటర్, డయాగ్నోసిస్ హబ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ వివిధ విభాగాల్లో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కొరత ఉంది.
Also read : ఆదిలాబాద్లో ఈజీఎస్ రోడ్ల పనుల్లో ప్రొటోకాల్ లొల్లి
అంతేగాక కొన్ని పరికరాలు కూడా అవసరం ఉన్నాయి. ఈ హాస్పిటల్లో ఉన్న సీఆర్మ్ మిషన్ పాడైపోగా జనగామ హాస్పిటల్ నుంచి టెంపరరీగా సర్దుబాటు చేశారు. ప్రస్తుతం ఉన్న అంబులెన్స్తరచూ రిపేర్‌కు వస్తున్నందున, మోడ్రన్ అంబులెన్స్ తో పాటు, డ్రైవర్‌ను సమకూర్చాల్సిన అవసరం ఉంది. కరెంట్ బిల్లు భారం అధికమవుతున్నందున సోలార్ ప్యానెల్ ఏర్పాటుచేయాలి. పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) ఒక అంబులెన్స్ కావాలి. ఇక్కడ సెల్ కౌంట్మిషన్, బయోకెమిస్ట్రీ ఎనలైజర్, ఎమర్జెన్సీ డెలివరీ, క్యాజువాలిటీ కేసుల కోసం అవసరమైన పరికరాలు, మొబైల్ఎక్స్రే మిషన్ కావాలి.