సుల్తానాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల మార్పు చేయబోదని, హేతుబద్ధీకరణ మాత్రమే ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు స్పష్టం చేశారు. సుల్తానాబాద్‌లో సోమవారం మండల ప్రజా పరిషత్ జనరల్‌బాడీ మీటింగ్నిర్వహించారు.
మీటింగ్‌లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో ఉందని, దీంతో పరిపాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. పంచాయతీ ఎలక్షన్స్.. పార్లమెంటు ఎన్నికల తర్వాతే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అప్పటివరకు పర్సన్ ఇన్‌చార్జిల పాలన ఉంటుందన్నారు.
మండల మీటింగ్‌కు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు జరిగేదాకా తమనే పర్సన్ ఇన్‌చార్జిలుగా కొనసాగించాలని పలువురు సర్పంచులు ఎమ్మెల్యేకు వినతిపత్రమిచ్చారు. ఎంపీపీ బాలాజీరావు, జడ్పీటీసీ స్వరూప, మార్కెట్ కమిటీ చైర్పర్సన్మౌనిక, ఎంపీడీవో శశికళ, తహసీల్దార్, అధికారులు పాల్గొన్నారు.