Cricket War : షమీ vs రోహిత్.. టీమిండియాలో భగ్గుమన్న విభేదాలు

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మిగిలిన టెస్టుల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరతాడా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది.  బీసీసీఐ వీలైనంత త్వరగా షమీని ఆస్ట్రేలియా తీసుకెళ్లాలని చూస్తుంటే మరోవైపు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. షమీ ఫిట్ నెస్ విషయంలో అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో షమీ మిగిలిన బోర్డర్ గవాస్కర్ టెస్టులకు అందుబాటులో ఉంటాడనుకుంటే రోహిత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. 

అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ ఓటమి అనంతరం రోహిత్ మాట్లాడుతూ షమీ 100 శాతం ఫిట్ గా లేడని చెప్పుకొచ్చాడు. ఓ వైపు మహమ్మద్ షమీ కంబ్యాక్ లో అదరగొడుతున్నాడు. రంజీల్లో రాణించిన షమీ.. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోను సత్తా చాటుతున్నాడు. సోమవారం (డిసెంబర్ 9) మ్యాచ్ ఆడి బ్యాటింగ్ లో మెరిశాడు. 17 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు.

ALSO READ | Team India: తిని హోటల్లో పడుకోవద్దు.. ప్రాక్టీస్‌కు రండి: రోహిత్ సేనకు చురకలు

బీసీసీఐ మిగిలిన ఆస్ట్రేలియా పర్యటనకు మహ్మద్ షమీని తీసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉందట. రాబోయే మూడు టెస్టులకు షమీని ఎంపిక చేసేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ అనుమతి కోసం బీసీసీఐ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్‌సిఎ నుండి షమీ తుది ఫిట్‌నెస్ ఫలితాలను బీసీసీఐ కోరిందని.. అతడు ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించబడిన తర్వాత షమీ తక్షణమే ఆస్ట్రేలియాకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

మరోవైపు రోహిత్ మాత్రం షమీ విషయంలో ఆసక్తి చూపించకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా టూర్ కు ముందు కూడా షమీ పూర్తి ఫిట్ నెస్ సాధించేందుకు  కష్టపడుతున్నాడని.. అతన్ని బలవంతంగా ఆడించడం తమకు ఇష్టం లేదని రోహిత్ తెలిపాడు. ప్రస్తుతం భారత ఫాస్ట్ బౌలింగ్ ను హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా మోస్తున్నారు. షమీ లాంటి  అనుభవం వీరికి తోడైతే భారత్ కు తిరుగుండదు.