హైదరాబాద్‌సిటీ, వెలుగు: తాగునీటి పైప్‌లైన్, డ్రైనేజీ పనులకు వినియోగించే మెటీరియల్క్వాలిటీ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయా కంపెనీలు సరఫరా చేసే ఉత్పత్తుల లెక్కలు పక్కాగా ఉండాలన్నారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్‌తో కలిసి శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. వాటర్‌బోర్డుకు స్టోర్స్ నిర్వహణ, మెటీరియల్స్సరఫరా చేస్తున్న కంపెనీల ప్రతినిధులు, బోర్డు డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు. వాటర్, డ్రైనేజీ పైపులు, ఇతర మెటీరియల్‌లో క్వాలిటీ ఉండడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయని, చాలా ప్రాంతాల్లో వాల్వ్‌లు లీకేజీ అవుతున్నాయని ఎండీ అశోక్‌రెడ్డి చెప్పారు. సప్లయర్ల నుంచి వివరణలు తీసుకున్నారు.