- దిగి పరిగెత్తిన ప్రయాణికులు
యాదాద్రి, వెలుగు : సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే రైలులో పొగలు కమ్ముకున్నాయి. గమనించిన లోకో పైలట్ రైలును బీబీనగర్రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. పొగలు వస్తున్నాయని తెలుసుకున్న ప్రయాణికులు భయంతో రైలు దిగి దూరంగా పరిగెత్తారు.
రైల్వే ఇంజినీర్లు సంఘటన స్థలానికి చేరుకొని బ్రేకులు పట్టేయడం వల్లే పొగలు వచ్చాయని నిర్ధారించి రిపేర్లు చేసి రైలును పంపించారు. గతేడాది జూలై 2న రాత్రి హైదరాబాద్‌నుంచి కొత్త ఢిల్లీకి వెళ్లే దక్షిణ్ఎక్స్ప్రెస్బీబీనగర్చేరుకున్నాక పొగలు వచ్చి పార్సిల్బోగి కాలిపోయింది.
ఈ ఏడాది జూలై 7న కూడా ఫలక్‌నుమా ఎక్స్ప్రెస్బొమ్మాయిపల్లికి చేరుకునే సమయానికి ఎస్ -4 బోగీలోని టాయ్లెట్వద్ద పొగలు వచ్చాయి. ఆ ఘటనలో మొత్తం ఐదు బోగీలు కాలిపోయిన సంగతి తెలిసిందే.