సైదాపూర్, వెలుగు : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ లో జలపాతాల వద్ద సందడి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల నుండి సందర్శకులు తరలి వస్తున్నారు. దగ్గర్లో ఉన్న ఈ అందమైన జలపాతాన్ని చూసేందుకు వెళ్లే తోవ మాత్రం బురదమయంగా ఉంది.
అడుగు తీసి అడుగు వేయాలన్నా, వెహికల్స్ ముందుకు కదలాలన్నా బురద బాధ తప్పడం లేదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సందర్శకులు కోరుతున్నారు.