జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం శాంతినగర్ లో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ కు ఎమ్మెల్యే అబ్రహం తనయుడు అజయ్ కు మధ్య ఘర్షణ జరిగింది. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా సభా వేదికపై ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆలంపూర్ లో ఎలా అడుగు పెడతావంటూ సాయి చంద్ ను ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్ నిలదీశారు. ఆలంపూర్ నుంచి తమకు పోటీగా సాయిచంద్ ఫోకస్ చేయటాన్ని అబ్రహం వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
ఎమ్మెల్యే అబ్రహం కొడుకు అజయ్, తనపై, గన్ మెన్, పీఏ పై దాడి చేశారని సాయిచంద్ ఆరోపించారు. అంతటితో ఆగకుండా పరుష పదజాలంతో దూషించారని తెలిపారు. తక్షణమే అజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.అంతవరకు ఆలంపూర్ వదిలి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేస్తానని సాయిచంద్ చెప్పారు.