అదిలాబాద్ జిల్లా రిమ్స్ మెడికల్ క్యాంపస్ లో అర్ధరాత్రి కలకలం రేగింది. మెడికల్ క్యాంపస్ గేట్ ను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. ఆ తర్వాత క్యాంపస్ లోకి చొరబడ్డారు. అడ్డుగా వచ్చిన విద్యార్థులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో విద్యార్థులను కారుతో ఢీకొట్టారు.
ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిందితుల్లో ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. రిమ్స్ మెడికల్ క్యాంపస్ లో జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.