హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పోలీస్ స్టేషన్ వెనక భాగంలో సీజ్ చేసిన గ్యాస్ సిలిండర్లకు నిప్పంటుకొని పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. పోలీస్ స్టేషన్ సమీపంలో బాణసంచా పేల్చడంతో ఎగిరిపడిన నిప్పురవ్వలు పడి సిలిండర్లు అంటుకొని పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.
మాదాపూర్ లోని ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం జరగలేదని సీజ్ చేసిన సామగ్రిలో ప్లాస్టిక్, చెక్కలకు సంభందించినవి ఉండటంతో మంటలు చెలరేగాయని మాదాపూర్ డీసీపి వినీత్ తెలిపారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేసిన సిలిండర్లకు అంటుకున్న మంటలు
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2024
ఈ ఘటనలో భద్రపరిచిన సిలిండర్లలో సంభవించిన పేలుడు.
సమీపంలో టపాకాయలు మంటలు సిలిండర్లపై పడ్డట్టు అనుమానం. pic.twitter.com/7zsZ8goLIC