ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు మంటల్లో పూర్తిగా తగలబడిపోయాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ ఇంజిన్లకు సమాచారం అందించారు. 

విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను ఆర్పి వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ మంటలకు తోడు.. పెద్ద ఎత్తున దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..? అనే దానిపైనా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.