సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత.. గాంధీపై ఫిర్యాదు చేసిన BRS ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : సైబరాబాద్ సీపీ కార్యాలయం దగ్గర గురువారం మధ్యాహ్నం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పాడి కౌశిక్  రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ నాయకులు సీపీ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేలకు మాత్రమేలోపలికి అనుమతి ఉందంటూ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. 

దీంతో తమనే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై దౌర్జన్యం ప్రదర్శించారు కౌశిక్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి ఓవరాక్షన్ చేశారు. సీపీ లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు సిబ్బందికి ఫిర్యాదు లేఖ ఇచ్చారు. 

ALSO READ | కొండాపూర్ లో హైటెన్షన్ : కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ.. అడ్డుకున్న పోలీసులు