మేడ్చల్ జిల్లా : ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే రూంలో ఇద్దరి ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. చౌదరిగూడ గ్రామం విజయపురి కాలనీలో ఈ ఘటన జరిగింది.
ఒకే రూమ్ లో ఓ విద్యార్థి ఉరి వేసుకోగా.. మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నివాస్ (19) అనే విద్యార్థి ప్రిన్సిటన్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్నాడు. సాయి గణేష్ (21) అనే యవకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి గణేష్ స్వస్థలం కోరుకొండ భద్రాచలం. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.