హైదరాబాద్ : వరంగల్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పిర్జాదిగూడ స్పార్క్ హాస్పిటల్ వద్ద.. ఓ లారీ యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో రోడ్డుకు మధ్యలో లారీ నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉప్పల్ బస్టాండ్ నుండి ఉప్పల్ డిపో వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది.
దాదాపు గంటకు పైగా వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి.. చాలా ఇబ్బందులు పడ్డారు. విషయం తెలిసి ఆలస్యంగా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. రోడ్డుకు మధ్యలో నిలిచిపోయిన లారీని క్రేన్ సహాయంతో తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు.