సంగారెడ్డి జిల్లాలో పీజీ స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. బీడీఎల్ భానూరు టౌన్ షిప్ లో శ్రీనివాస్ రాజు దంపతులు నివసిస్తున్నారు. వీరి కూతురు తేజస్వి(25) పీజీ చదువుతోంది. రెండు రోజుల క్రితం అన్నవరం వెళ్లి ఏప్రిల్ 25న మధ్యాహ్నం బీడీఎల్ టౌన్ షిప్ (ఇంటికి)కు వచ్చింది. మధ్యాహ్నం ఫ్రెష్ అప్ అయిన తర్వాత తన గదిలోకి వెళ్లి..ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తేజస్వి కర్ణాటక రాష్ట్రంలోని మణిపాల్ యూనివర్సిటీలో సైకాలజీ చదువుతుంది. ఈ సబ్జెక్ట్ ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తేజస్వి మృతికి సంబంధించిన వివరాలను బీడీఎల్ భానూరు పోలీసులు సేకరించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.