కుటుంబ కలహాలతో కూతురికి విషం తాగించి, తండ్రి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో కూతురికి విషం తాగించి, తండ్రి ఆత్మహత్య
  • కుటుంబ కలహాలతో కూతురికి విషం తాగించి, తండ్రి ఆత్మహత్య

నాగర్ కర్నూల్, వెలుగు :  నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్  మండలం ఎల్లూర్  గ్రామంలో కుటుంబ కలహాలతో  ఓ వ్యక్తి కూల్ డ్రింక్ లో విషం కలిపి కన్న కూతురితో తాగించాడు. పాప ఆరోగ్య పరిస్థితి విషమించి ట్రీట్​మెంట్ కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. కూతురు పరిస్థితికి తానే కారణమయ్యానని ఆవేదనతో  ఉరేసుకున్నాడు. గ్రామానికి చెందిన శేఖర్(39) హైదరాబాద్ లో కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడు. 15 రోజుల కింద కుటుంబంతో సొంతూరుకు వచ్చాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం పొద్దున తన కూతురు రక్షిత(10)ను పొలం వద్దకు తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగించాడు. పాప పరిస్థితి విషమించడంతో కొల్లాపూర్ హాస్పిటల్ కు అక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ALSO READ :ఏపీ పాలిటిక్స్ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్.. ఆ నాయకుడే టార్గెట్?

అక్కడి నుంచి హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు కొల్లాపూర్  పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. రక్షిత జిల్లా ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందుతుండగా, పురుగుల మందు తాగాడనే అనుమానంతో  శేఖర్​ను కూడా హాస్పిటల్​లో చేర్పించారు.  అయితే మొబైల్​ స్విచ్​ఆఫ్​ చేసుకుని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన శేఖర్.. ​ కూతురి పరిస్థితికి తానే కారణమని,  మనస్తాపంతో బిజినేపల్లి మండలంలోని చెరువు వెనక చెట్టుకు ఉరేసుకున్నాడు. సూసైడ్​ చేసుకునే ముందు మొబైల్  ఆన్  చేయడంతో లొకేషన్  ట్రేస్  చేసిన పోలీసులు డెడ్​బాడీని గుర్తించారు.