హైదరాబాద్ షేక్ పేట్ లో విషాదం నెలకొంది. పారామౌంట్ కాలనీలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతిచెందారు. నీటి సంప్ వద్ద మోటర్ ఆఫ్ చేయడానికి ఓ యువకుడు వెళ్లాడు. ఆఫ్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలింది. అతని అరుపులు విని..రక్షించడానికి ఇద్దరు వెళ్లారు. దీంతో ముగ్గురికి విద్యుత్ షాక్ తగిలి..స్పాట్ లోనే కుప్పకూలిపోయారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతిచెందిన వారు అనాస్(19), రజాక్(18), రిజ్వాన్(16 ). ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.