
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం నెలకొంది. పోచారం గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలో ట్రాక్టర్ ట్రాలీ కిందపడి తొమ్మిది సంవత్సరాల బాలుడు మృతిచెందాడు. మృతుడు చెర్ల పటేల్ గూడ గ్రామానికి చెందిన సెహనాథ్(14) గా గుర్తించారు. అప్పటివరకూ ఎంతో సంతోషంగా ఆడిపాడిన పిల్లాడు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.