కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాకలో విషాదం నెలకొంది. చెక్ డ్యాంలో స్నానానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు పడి చనిపోయారు.
కొండపాకలో శివారు(పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి పరిధిలో)లోని చెక్ డ్యామ్ లో స్నానం చేసేందుకు బాలిక నిత్య(12), బాలుడు కన్ని(13) మిగతా కొంతమంది పిల్లలతో కలిసి వెళ్లారు. స్నానం చేస్తుండగా.. నీళ్లలో మునిగిపోయి నిత్య, కన్ని మృతిచెందారు. మరో ముగ్గురు పిల్లలు కూడా మునిగిపోతుండగా స్థానికులు కాపాడినట్లు సమాచారం.
ఇద్దరు పిల్లల మృతితో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వీరి స్వస్థలం జమ్మికుంట మండలం తనుగుల గ్రామం. ఎల్లమ్మ బోనాల కోసం బంధువుల ఊరైన కొండపాకకు వచ్చి.. ఇలా మృత్యువాత పడడం తీవ్ర విషాదం నింపింది.