మియాపూర్ లో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్ : మియాపూర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మియాపూర్ పోలీస్టేషన్ పరిధిలోని కేఎస్ బేకర్స్ వద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేశారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.