
హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్ పరిధిలో సోమవారం (అక్టోబర్ 16న) అగ్నిప్రమాదం జరిగింది. వనస్థలిపురంలోనీ VIP స్టోర్ లో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఉదయం ఆరున్నర సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే ఫైర్, DRFసిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్లిందన్న దానిపైనా విచారణ చేస్తున్నారు.