ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి అన్న ప్రసాదంలో జెర్రీ తీవ్ర కలకలం రేపింది. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఓ భక్తుడు ఇవాళ (2024, అక్టోబర్ 5) భోజనం చేస్తుండగా అందులో జెర్రీ ప్రత్యక్షం అయ్యింది. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన భక్తుడు.. దీనిపై టీటీడీ అధికారులను నిలదీశాడు. అన్న ప్రసాదంలో జెర్రీ రావడంపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా శ్రీవారి అన్న ప్రసాదంలో జెర్రీ ప్రత్యక్షమవడంతో భక్తులు మండిపడుతున్నారు.
Also Read :- తిరుమల టూర్.. ఈ తీర్థ క్షేత్రాలను తప్పక చూడండి...
తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత పెంచామని.. అత్యంత పరిశుభ్రతగా టీటీడీ అన్న ప్రసాద కేంద్రాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇవాళ (2024, అక్టోబర్ 5) ఉదయం తిరుమలలో చెప్పిన గంటల వ్యవధిలోనే శ్రీవారి అన్న ప్రసాదంలో జెర్రీ ప్రత్యక్షమవడంతో కావడం గమనార్హం. అన్న ప్రసాదంపెరుగులో జెర్రీ ప్రత్యక్షమైందని భక్తులు సిబ్బందికి తెలిపినప్పటికీ టీటీడీ స్టాఫ్ దురుసుగా ప్రవర్తించడంపై సీరియస్ అవుతున్నారు భక్తులు.
శ్రీవారి భక్తుల ప్రాణాలతో టీటీడీ చలగాటమాడుతోందని భక్తులు ఫైర్ అవుతున్నారు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో భక్తులకు ఫుడ్ పాయిజన్ అయితే ఎవరూ సమాధానం చెప్తారంటూ భక్తులు మండిపడుతున్నారు. తిరుమల కొండపై ప్రక్షాళన మొదలుపెట్టామని ఓ పక్కా చంద్రబాబు చెబుతున్నారు.. ఇదిలా ఉండగానే అన్న ప్రసాదంలో జెర్రీ ప్రత్యక్షం కావడంతో ఈ ఘటనపై సీఎం ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరీ.