ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో స్ట్రీట్ ఫైట్ చోటు చేసుకుంది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ యువతికి రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామానికి చెందిన ధర్మసోత్ సతీష్ యువకుడితో గతేడాది వివాహం జరిగింది. కొద్దిరోజులు సజావుగానే సాగిన వీరి సంసారంలో మరో యువతి ఎంటర్ కావడంతో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. తాజగా సతీష్ ఆ యువతితో మరింత సన్నిహితంగా మెలుగుతున్నాడని సతీష్ భార్య తెలిపింది. పద్ధతి మార్చుకోవాలని యువతి సతీష్ కు పలుమార్లు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో విసిగిపోయిన యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
కాగా సతీష్ గతంలోనే ఓ యువతిని పెళ్ళాడి విడాకులు తీసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న కానీ సతీష్ తీరులో మార్పు రాలేదని యువతి వాపోయింది. కాగా ఈ కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా పోలీసులు వెళ్లి రెండు బృందాలను చెల్లాచెదురు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.