మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్

 మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్

హైదరాబాద్: మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం రాజుకుంది. 2024, డిసెంబర్ 14 శనివారం రాత్రి జల్ పల్లిలోని తన నివాసంలో స్నేహితులతో కలిసి మంచు మనోజ్ పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీకి విద్యుత్ సరఫరా కోసం మనోజ్ బయట నుండి జనరేటర్లను తెప్పించాడు.  మనోజ్ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయడంతో అసహనానికి గురైన విష్ణు.. తన మనుషులతో మనోజ్ ఇంట్లోని జనరేటర్లలో పంచదార వేయించాడు. ఈ విషయాన్ని మనోజ్ గమనించడంతో మరోసారి అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. 

విష్ణు మనుషులు జనరేటర్‎లో పంచదార పోయడానికి సంబంధించిన ఆధారాలతో పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేసేందుకు మనోజ్ రెడీ అయ్యాడు. దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం (డిసెంబర్ 15) రాత్రి 7 గంటలకు పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్‎కు వెళ్లి మనోజ్ ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.  ఇప్పటికే శాంతి భద్రతలకు విగాథం కలిగించవద్దంటూ మనోజ్, విష్ణు ఇద్దరితో రాచకొండ సీపీ బాండ్ రాయించుకోగా.. వీరి మధ్య మరోసారి గొడవ జరగడం హాట్ టాపిక్‎గా మారింది. 

ALSO READ | నాగబాబు ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఇక విభేదాలకు చెక్ పడ్డట్లేనా..!

కాగా, గత 10 రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతోన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద చోటు హైడ్రామా చోటు చేసుకుంది. తండ్రి మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మనోజ్ వెళ్లగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గేట్లు తోసుకుని బలవంతంగా మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహానికి గురైన మోహన్ బాబు.. తన ఇంటి వద్ద జరుగుతోన్న పరిస్థితులను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగాడు. 

ఏకంగా జర్నలిస్టుల చేతిలో మైకును లాక్కునే వారిపైనే దాడి చేశాడు. ఫ్యామిలీ ఇష్యూ, మీడియాపై దాడి చేయడంతో రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై సీరియస్ అయ్యారు. మంచు ఫ్యామిలీ లొల్లి మరింత ముదరటంతో విచారణకు హాజరు కావాలంటూ మంచు మోహన్ బాబు, మనోజ్, విష్ణుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు బుధవారం (డిసెంబర్ 11) మనోజ్, విష్ణు విచారణకు హాజరయ్యారు. అనారోగ్యం, కోర్టు మినహాయింపుతో మోహన్ బాబు పోలీసుల విచారణకు హాజరు కాలేదు. మరోవైపు.. జర్నలిస్ట్‎పై దాడి ఘటనపై మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.