న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టం సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశంలో గందరగోళం నెలకొంది. వక్ఫ్ చట్టాలకు సూచించిన మార్పులను అధ్యయనం చేయడానికి తగినంత సమయం ఇవ్వడంలేదని ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు.
దీంతో తృణమూల్ పార్టీకి చెందిన కల్యాణ్ బెనర్జీ, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, డీఎంకే నేత ఎ రాజా సహా పది మంది ప్రతిపక్ష ఎంపీలను చైర్మన్జగదాంబికా పాల్ఒక్క రోజు సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ.. చైర్మన్ఇష్టానుసారంగా, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీ ఎన్నికలకు ముందే బిల్లును ఆమోదించేందుకు అధికార బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయితే, ప్రతిపక్ష సభ్యులే సమావేశానికి అంతరాయం కలిగించే లక్ష్యంతో ప్రవర్తిస్తున్నారని చైర్మన్ తప్పుబట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కల్యాణ్ బెనర్జీ తనపై దుర్భాషలాడారని ఆయన ఆరోపించారు.
సమావేశాన్ని క్రమబద్ధీకరించడానికి తాను ప్రయత్నించానని, అందుకు రెండుసార్లు వాయిదా వేశానని.. కానీ, ఫలించలేదని పేర్కొన్నారు. కమిటీ తిరిగి సమావేశమైన తర్వాత తీవ్ర వాదనలు జరిగాయి. కాశ్మీర్ మత నాయకుడు మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది.
ప్రభుత్వం మతపరమైన విషయాలలో జోక్యం చేసుకుంటోందని, వక్ఫ్ చట్టాల్లో మార్పులకు తాను మద్దతివ్వలేనని మిర్వైజ్ చెప్పారు. కాగా, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన అసహ్యకరంగా ఉందని బీజేపీ సభ్యురాలు అపరాజిత సారంగి మండిపడ్డారు. సమావేశంలో గందరగోళం సృష్టించారని, పాల్‌పై అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగిస్తున్నారని అన్నారు.
స్పీకర్‌కు ఎంపీల లేఖ..
జాయింట్ పార్లమెంటరీ కమిటీ కార్యకలాపాలు న్యాయమైన రీతిలో సక్రమంగా జరిగేలా చూడాలని సస్పెండైన ఎంపీలు లోక్ సభ స్పీకర్ఓంబిర్లాకు లేఖ రాశారు. చైర్మన్ జగదాంబికా పాల్ కార్యకలాపాలను ఇస్టానుసారంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
తమ డిమాండ్లను వినాలని ప్రజాస్వామ్యబద్ధంగా అడిగామని.. ఇంతలో చైర్మన్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడి అకస్మాత్తుగా, ఆశ్చర్యకరంగా తమను సస్పెండ్ చేయాలని ఆదేశించారని వారు లేఖలో పేర్కొన్నారు.