నిమ్స్​లో అయోమయం

  • మన్మోహన్ ​మృతికి సంతాపంగా హాలిడే ప్రకటన 
  • అకస్మాత్తుగా ఓపీ బంద్​పై పేషెంట్స్​ ఆగ్రహం

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని నిమ్స్​ హాస్పిటల్ లో శుక్రవారం అయోమయ పరిస్థితి నెలకొంది. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​మృతికి సంతాపంగా నిమ్స్ కు సెలవు ప్రకటిస్తున్నట్లు ఉదయం ఆస్పత్రి  డైరెక్టర్​ బీరప్ప పేరుతో సర్క్యూలర్​ రిలీజ్ అయ్యింది. దాంతో ఉదయం ఏడు నుంచి ప్రారంభం కావాల్సిన ఓపీ సేవలు నిలిచిపోయాయి. అయితే, ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా హాలిడే ప్రకటించడం, ఓపీ సేవలు బంద్ పెట్టడంపై పేషెంట్స్​ ఆందోళనకు దిగారు. 

దూర ప్రాంతాల నుంచి ట్రీట్మెంట్ కోసం వచ్చామని, అకస్మాత్తుగా సేవలు నిలిపివేస్తే ఎలా అంటూ అధికారులను ప్రశ్నించారు. నిమ్స్​ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సెలవు నిర్ణయంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన అధికారులు.. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు హాలిడే క్యాన్సిల్ అంటూ మరో సర్క్యూలర్​ ను రిలీజ్​ చేశారు. కాగా.. ఓపీ, ఆపరేషన్లకు మాత్రమే అంతరాయం ఏర్పడిందని, ఎమర్జెన్సీ, క్యాజుయాలిటీ సేవలు కొనసాగాయని సమాచారం.