శ్రీశైల మల్లన్న చెంత భారీ వర్షం కురిసింది. గత రెండు రోజులుగా తూఫాన్ కారణంగా చల్లబడ్డ వాతావరణం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షం ధాటికి గత నెల రోజులుగా ఎండ తీవ్రత, వేడి గాలులతో భక్తులు, స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుంచి ఎండ ఉండి.. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో.. భక్తులు రూములకే పరిమితమయ్యారు. మూడు గంటల నుండి వదలకుండా కురిసిన వర్షంతో ఆలయ ప్రధాన వీధులు మొత్తం జలమయంతో నిండిపోయాయి. వర్షం కురవడం ఆగిపోయిన తర్వాత వసతి గృహాల నుండి స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బయటకు వచ్చారు.
శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఉమా రామలింగేశ్వర దేవాంగ సత్రం ముందు ఉన్న చెట్టు గాలి వాన దెబ్బకి ఒకసారిగా కుప్పకూలింది. ఆ చెట్టు కూలిపోతున్న సమయంలో అటుగా వెళ్తున్న కారుపై పడింది. అదృష్టవశాత్తు ఆ కారులో డ్రైవర్ తప్ప మరెవరు లేరు. అయినప్పటికీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.