- వరంగల్‌లో టెన్షన్.. టెన్షన్
- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం
- మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు
- ఇరువర్గాల మధ్య తోపులాట
- పలువురి అరెస్ట్
వరంగల్/హనుమకొండ : వరంగల్ ఎంజీఎం సర్కిల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలు, నెరవేరని ఎన్నికల హామీలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ప్రధాన రహదారిపై బారికేడ్లను ఏర్పాటుచేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నాకు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేశారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ఆఫీస్‌వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా.. వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా నేతలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు వరంగల్, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్, ఎర్రబెల్లి స్వర్ణలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కొండా మురళి, సురేఖ దంపతులను హౌస్అరెస్ట్చేశారు. బీఆర్ఎస్కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక తెలంగాణలో వారి ఆటలు సాగవు అని మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌లతో ఆందోళనను అడ్డుకోలేరంటూ బీఆర్ఎస్ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.