హనుమకొండ జిల్లా పరకాలలో ఉద్రిక్తత ఏర్పడింది. పరకాల టౌన్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ లో మాట్లాడుతుండగా అదే సమయంలో అటుగా బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ప్రచార వాహనం వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య నుంచే వెళ్లడంతో వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాహనం తిప్పుకుని వెళ్లాల్సిందిగా చెప్పినా డ్రైవర్ పట్టించుకోలేదు.
ఆవేశంతో బీఆర్ఎస్ వాహనంపైకి కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు.