ఒకప్పుడు భూమిపై రోజుకు 26 గంటలు

ఒకప్పుడు భూమిపై రోజుకు 26 గంటలు

చైనాలోని చెంగ్డూ యూనివర్సిటీ ఆఫ్​ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై రోజుకి 26 గంటలు ఉండేవని వెల్లడైంది. చంద్రుడి గురుత్వాకర్షణ భూభ్రమణంపై ప్రభావం చూపుతుందని, ఈ శక్తి తగ్గడం వల్ల భూభ్రమణ వేగం 2 గంటల మేరకు పెరిగిందని తెలిపారు.

500 మిలియన్​ ఏండ్ల నుంచి 650 మిలియన్​ ఏండ్ల మధ్య సంభవించిన కేంబ్రియన్​ పేలుడు, 280 మిలియన్​ సంవత్సరాల నుంచి 340 మిలియన్​ సంవత్సరాల మధ్య జరిగిన మరో పేలుడు వల్లనే రోజు నిడివి పెరిగిందని పేర్కొన్నారు.